- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆందోళన విరమించిన రైతు సంఘాలు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సరిహద్దుల్లో మొదలైన రైతుల ఆందోళనలు సరిగ్గా రిపబ్లిక్ డే రోజు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనలో అధిక సంఖ్యలో పోలీసులు గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ఘాజీపూర్ సరిహద్దును ఖాళీ చేయాలని రైతులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రాత్రిలోపే ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో బలవంతంగా ఖాళీ చేయించాల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా చేశారు.
ఈ పరిణామాలతో ఘాజీపూర్ సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. అటు సింఘు వద్ద రైతులకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో మరో రెండు రైతు సంఘాలు కూడా ఆందోళనలు విరమించాయి. కిసాన్ మహా పంచాయత్, భారతీయ కిసాన్ యూనియన్ సంఘాలు ఆందోళన నుంచి తప్పుకున్నాయి. కాగా, బుధవారం రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, బీకేయూ సంఘాలు కూడా విరమించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు మొత్తం నాలుగు రైతు సంఘాలు సరిహద్దుల నుంచి వెనుదిరిగాయి.