- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అటు అకాల వర్షం.. మరోవైపు వాటి కొరత.. ఆందోళనలో అన్నదాతలు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వర్షాల కారణంగా ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతన్నలకు గన్నీ బ్యాగుల కొరత కన్నీరు తెప్పిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చినప్పటికీ.. కొనుగోళ్లు జరగకపోవడంతో ధాన్యం కుప్పల మీదే రైతన్న గుండె ఆగిపోతోంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం అకాల వర్షాలకు తడిచి ముద్ద అవ్వగా.. గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ సీజన్‌లో 25 కోట్ల జనపనార బస్తాలు అవసరం ఉండగా.. కేవలం 12 కోట్ల గన్నీ బ్యాగులే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
వరిలో తేమ శాతాన్ని తగ్గించే జనపనార బ్యాగులు సరిపడా లేకపోవడంతో రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో 25 లక్షల హెక్టార్లలో వరిసాగు చేయగా.. 1.2 కోట్ల దిగుబడి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఈ గన్నీ బ్యాగులను FCI రైతులకు రూ.20లకే అందిస్తోంది. అయితే, ఈ గన్నీ బ్యాగులను ఒక్కసారి మాత్రమే వినియోగించాల్సి ఉండగా.. సరఫరా కొరత కారణంగా గతేడాది వినియోగించిన వాటిని తిరిగి వినియోగించేందుకు ఎఫ్‌సీఐ అనుమతిచ్చింది.
అయితే, వరి ఉత్పత్తి పెరుగుతుండటంతో డిమాండ్‌కు అనుగుణంగా కాంట్రాక్టర్లు గన్నీ బ్యాగుల ధరను పెంచుతున్నారు. వీటి ధరలు అమాంతం పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచకపోవడంతో కేంద్రాల్లో రైతులకు టోకెన్లు వచ్చినా కొనుగోళ్లు జరగడం లేదు.