- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆరుగాలం ఆశలు ఆవిరాయే.. గింజలన్నీ మొలకెత్తే..
దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ స్థాయిలో నామమాత్రంగా ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి అన్నారు. శనివారం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని పలు మండలాల్లో పంట కోత కోసి నెలలు గడుస్తున్నా వడ్లు కొనుగోలు చేయకపోవడంతో ఈ మధ్య కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతుందన్నారు.
తిమ్మాపూర్ మండలం ఫోరండ్ల గ్రామానికి చెందిన కిన్నారవేని రాజయ్య అనే నిరుపేద కౌలు రైతు సుమారు 5 ఎకరాలలో పండించిన పంట రోడ్డుపై పోసి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు వడ్లను కొనుగోలు చేయలేదు. దీంతో చాలా వరకు మొలకెత్తాయి. వాటిని చూసి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అనంతరం కేశవపట్నంలో గల వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో గల కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా నామమాత్రంగా వరి ధాన్యాన్ని కాంటాలు వేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
కొనుగోలు కేంద్రంలో రైతుల తీసుకొచ్చిన ధాన్యం బస్తాల్లో తేమ, తాలు ఉందని, నల్లగా ఉన్నాయని క్వింటాలుకు రెండు నుంచి మూడు కిలోల వరకు కటింగ్ చేస్తామని రైస్ మిల్లు యజమానులు మాట్లాడుతున్నట్టు తెలిసిందన్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆకస్మిక తనిఖీలు జరిపి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మిల్క్ కూరి వాసుదేవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వెల్మ రెడ్డి రాజారెడ్డి, సహాయ కార్యదర్శి గుండెటి వాసుదేవ రెడ్డి, కమిటీ సభ్యులు శీలం అశోక్, పిట్టల తిరుపతి, మండల నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.