విషాదం.. విద్యుత్ షాక్‌‌తో రైతు మృతి

by Sumithra |
Farmer died
X

దిశ, నార్కట్‌పల్లి: విద్యుత్ఘాతంతో రైతు మృతిచెందిన ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిప్పలపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… చిప్పలపల్లి గ్రామానికి చెందిన ఉట్కూరు వెంకట్ రెడ్డి(46) రోజూ లాగే తన వ్యవసాయ బావి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో బావిదగ్గర మోటార్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో మోటార్ స్టార్టర్‌ను కటింగ్ ప్లేయర్‌తో రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story