- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెవెన్యూ అధికారుల తీరుపై మనస్థాపంతో రైతు మృతి..
దిశ,వెబ్ డెస్క్ :
రెవెన్యూ అధికారుల ప్రవర్తన తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురైన ఓ రైతు మనస్థాపం చెంది మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని ఏపూర్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మండాది మల్లయ్య (60) పదిహేనేళ్ల కిందట కొనుగోలు చేసిన భూమిని కొందరు అక్రమార్కలు కబ్జా చేశారు. అయితే, దానికి పట్టా చేయాలని పలుమార్లు ఆఫీసు చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. అంతేకాకుండా, ఆ భూమిని మల్లయ్యకు అమ్మిన వారినుంచి రివర్స్‌లో మామూళ్లు తీసుకొని భూమిపై 144 కేసు నమోదు చేశారు.
తనకు భూమిని అమ్మిన వారే తిరిగి దానిని దున్నుకుంటున్నారని చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన మల్లయ్య సోమవారం రాత్రి మృతిచెందాడు. దీంతో బాధిత రైతు మృతదేహాన్ని తహసీల్దారు గడ్డం రాంరెడ్డి ఇంటి ఎదుట పెట్టి బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ భూమి వివాదానికి కారణమైన తహసీల్దార్‌ను ఇటీవల ఉన్నతాధికారులు మట్టంపల్లిలో సస్పెండ్ చేశారు.