రారండోయ్ దర్శనానికి వెళ్దాం !

by srinivas |
రారండోయ్ దర్శనానికి వెళ్దాం !
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు రావడంతో చిన్న షాపుల నుంచి పరిశ్రమల వరకు పున:ప్రారంభం అవుతున్నాయి. ఇదే క్రమంలో జనతా కర్ఫ్యూ ముందు మూతబడిన దేవాలయాలు దర్శనాలకు రెడీ అయ్యాయి. మొన్న ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు రాష్ట్రాల సీఎంలు సడలింపులు కోరడంతో ఆదిశగా కేంద్రం అనుమతుల జారీ చేసింది. దీంట్లో భాగంగానే ఏపీలో ప్రముఖ ఆలయాల్లో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ రాగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లడ్డూలు, వడల విక్రయాలను ప్రారంభించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, శ్రీశైలం మల్లన్న, మంగళగిరి పానకాల స్వామి, శ్రీకాళహస్తి దేవాలయాలన్నీ త్వరలోనే తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు విధిగా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని, భౌతిక దూరం తప్పనిసరని పేర్కొంది.

దర్శనానికి సంబంధించిన టైం స్లాట్‌ను భక్తులు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని సూచించింది. దేవాలయాల్లో డిస్ ఇన్‌ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేయడంతోపాటు శానిటైజేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ పేర్కొంది. అలాగే, ఆలయ పరిసరాలను, క్యూలైన్‌ను ఎప్పటికప్పుడు హైపోక్లోరైడ్ ద్రావణంతో స్ప్రే చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు దేవాలయాలకు వెళ్లి దర్శనాలకు రెడీ అయిపోతున్నారు. అయితే, ఆలయాలు ఎప్పటి నుంచి తెరవాలన్న విషయాన్ని మాత్రం జీవోలో స్పష్టంగా చెప్పకపోవడంతో భక్తులు కాస్తంగా నర్వస్‌గా ఫీలవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed