మైక్రోసాఫ్ట్ నుంచి ఫ్యామిలీ సేఫ్టీ యాప్

by Harish |
మైక్రోసాఫ్ట్ నుంచి ఫ్యామిలీ సేఫ్టీ యాప్
X

పిల్లల స్క్రీన్ టైమ్, యాప్ యూసేజ్ మీద తల్లిదండ్రులకు మరింత నియంత్రణ కలిగించడానికి వీలుగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక ప్రత్యేక యాప్‌ను విడుదలచేస్తోంది. ఫ్యామిలీ సేఫ్టీ అనే పేరుతో ఉన్న ఈ యాప్ ద్వారా డిజిటల్ రక్షణతో పాటు భౌతిక రక్షణ కూడా అందించే సదుపాయం కలుగుతుంది. ప్రస్తుతానికి
ఈ యాప్ ఆండ్రాయిడ్, యాప్‌స్టోర్‌లలో డౌన్‌లోడ్‌కి సిద్ధంగా ఉంది కానీ లిమిటెడ్ ప్రివ్యూ పేరుతో కొన్ని సదుపాయాలను మాత్రమే అందిస్తోంది.

మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సేఫ్టీ యాప్ ద్వారా పిల్లలు డిజిటల్ మీద ఎంత సమయం వెచ్చిస్తున్నారు? ఎక్కువగా చూస్తున్న వెబ్‌సైట్లు ఏంటి? ఎలాంటి పదాలను సెర్చ్ చేస్తున్నారు? అనేవి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ లెర్నింగ్ వంటి వాటి మీద ఎక్కువ సమయం వెచ్చించేలా వారితో చర్చించి ఒక షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా లొకేషన్ షేరింగ్ పరిధిలో లేనప్పటికీ పిల్లలు ఎక్కడున్నారనేది తెలుసుకోవచ్చు. నెలవారీగా, వారాలవారీగా పిల్లలు ఆన్‌లైన్‌లో వెచ్చించిన సమయం గురించి ఈమెయిళ్లు కూడా అందుతాయి. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా అన్ని మైక్రోసాఫ్ట్ ఆధారిత పరికరాలను ఈ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఫిక్స్ చేసిన పరిధిని దాటి పిల్లలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్లయితే మీకు వెంటనే అలర్ట్ వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed