న్యాయం చేయాలని కోరితే.. కుల బహిష్కరణ విధించిన పెద్ద మనుషులు

by Shyam |   ( Updated:2021-11-01 11:20:15.0  )
న్యాయం చేయాలని కోరితే.. కుల బహిష్కరణ విధించిన పెద్ద మనుషులు
X

దిశ, ఆర్మూర్ : చట్టాలు, కోర్టులు, పోలీసు వ్యవస్థ ఇవన్నీ ఉన్నా ఇంకా కొన్నిగ్రామాల్లో కులపెద్దలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తమకు న్యాయం చేయాలని ఓ కుటుంబం కులపెద్దల వద్దకు వెళ్లగా ఏకపక్షంగా తీర్పునిచ్చి వారిపై దాడికి దిగి మరీ కుల బహిష్కరణ చేసిన ఘటనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. సాగు భూమి వివాదం విషయంలో తమకు న్యాయం చేయాలని కులపెద్దల వద్దకు వెళ్లగా.. వారు భూమిని సర్వే చేయించకుండా చెరుకు ఆలూరు నారాయణ, మమత కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఏకపక్షంగా తీర్పునివ్వడంతో పాటు తమను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు మల్లన్న, బుచ్చన్న, కుమార్, చిన్న మల్లన్న, తాటి అనిల్, రాములు సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

అంతేకాకుండా దౌర్జన్యంగా రూ.2 లక్షలు విలువ చేసే పంటను ట్రాక్టర్‌తో దున్నించి పంటను నాశనం చేశారని.. అంతటితో ఆగకుండా తమపై దాడులకు పాల్పడి గాయపరిచారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. తమపై దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని, తమపై అమలవుతున్న కుల బహిష్కరణను తొలగించడంతో పాటు పంట నష్టం చేసిన వారి నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed