జామాయిల్ తోటలో కుటుంబం ఆత్మహత్య

by srinivas |
జామాయిల్ తోటలో కుటుంబం ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామ శివారులోని జామాయిల్ తోటలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను యనదుర్రు గ్రామానికి చెందిన దంపతులు సీరే పరశురాం (45), ధన సావిత్రి (35), కుమారుడు నాగవెంకట శ్రీనివాస్ (12)గా గుర్తించారు. కుటుంబసభ్యులు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అత్తిలి గ్రామానికి చెందిన ఓ మహిళకు ఈ కుటుంబం మధ్యవర్తిగా ఉండి రూ.45లక్షలు అప్పు ఇప్పించిందని, ఇటీవల ఆమె కనిపించకుండా పోవడంతో డబ్బులు తిరిగిరావన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed