- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ములుగు జిల్లాలో పులుల సంచారం.. అంతా ఫేక్
by Shyam |
X
దిశ, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సరిహద్దు ప్రాంతంలో గల ఎదిరగుట్ట అటవీ ప్రాంతంలో మూడు పులులు సంచరిస్తున్నాయి.. అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఉత్తదే అంటూ అటవీశాఖ అధికారులు నిర్ధారణ చేశారు. ఫేక్ వార్త వైరల్ కావడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దిశ రిపోర్టర్ చర్ల రేంజ్ అధికారి ఉపేందర్‌కు ఫోన్‌లో వివరణ కోరగా.. పులుల ఆనవాళ్లు ఎదురగుట్ట అటవీ ప్రాంతంలో కాదని చెప్పారు. వైరల్ అవుతున్న వీడియో వేరే ప్రాంతానికి చెందినది అంటూ పుకార్లను కొట్టిపారేశారు. ఫేక్ వార్తలను ప్రజలు నమ్మొద్దని ఆయన ప్రజలకు సూచించారు.
Advertisement
Next Story