- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ ఇంటిలిజెన్స్ బ్యూరో ఎస్పీ గుట్టురట్టు
దిశ, మంచిర్యాల: ఇంటిలిజెన్స్ బ్యూరో ఎస్పీని అంటూ తన కారుకు పోలీస్ సైరన్ పెట్టుకొని తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం హాజీపూర్ మండల కేంద్రంలో పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం హజీపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్ మహాజన్ పూర్తి వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గౌతమ నగర్ కు చెందిన ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తాను ముంబాయిలో ఇంటిలిజెన్స్ ఎస్పీగా పని చేస్తున్నానని తన కారుకు పోలీస్ సైరన్ పెట్టుకొని తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో లాక్‌డౌన్ సమయంలో గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుండి గోదావరిఖనికి వస్తుండగా రాత్రి 8.30 గంటలకు హాజీపూర్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పోలీస్ సైరన్ వేసుకొని వస్తున్న ప్రదీప్ ను వివరాలు అడిగారు. తాను ఇంటిలిజెన్స్ ఎస్పీగా ముంబాయిలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పిన ప్రదీప్ ను ఐడి కార్డు చూపించాలని పోలీసులు అడగగా చూపలేదు. అనంతరం అతని ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలు చూపాలని అడిగినా చూపకపోవడంతో కారును పోలీస్ స్టేషన్ కు తరలించి, అతనిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై చంద్రశేఖర్ పాల్గొన్నారు.