- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దొంగ మహిళ… డాక్టర్ అవతారమెత్తి..
దిశ, వెబ్‌డెస్క్: బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో నకిలీ వైద్యురాలి భాగోతం బయటపడింది. కరోనా వైరస్‌ను అడ్డుపెట్డుకుని వైద్యురాలి అవతారంలో శైలజా అనే మహిళా చోరీకి పాల్పడింది. ఏకంగా వైద్యులు విధులు ముగించిన తర్వాత వారు ఉపయోగించే పీపీఈ కిట్లను ధరించి మరీ దొంగతనానికి పాల్పడింది. చివరకు పోలీసులకు పట్టుబడింది.
బెజవాడ ఆస్పత్రిలో కొవిడ్ బాధితులు ఆదమరిచిన సమయంలో.. కిట్ వేసుకొచ్చిన శైలజా వారి సెల్‌ఫోన్లను అపహరించింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ వారికి మెరుగైన సేవలు అందిస్తానని నమ్మబలుకుతూ డబ్బులూ వసూలు చేసింది. అయితే, ఇటీవల కిట్‌తోనే బయటకు వెళ్తుండటంతో శైలజను సిబ్బంది నిలదీశారు. దీంతో భయంతో నిందితురాలు అక్కడి నుంచి పారిపోయింది.
దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా.. మరో ఇద్దరు మారువేషంలో ఆస్పత్రికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ శైలజా భర్తపై చీటింగ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా కొవిడ్ ఆస్పత్రిలో ఇటువంటి మోసాలకు తెరలేపడంపై పేషంట్లు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.