నకిలీ ఆధార్ కార్డుల కలకలం..

by Shamantha N |
నకిలీ ఆధార్ కార్డుల కలకలం..
X

కోరుట్లలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం సృష్టించాయి. భారతీయులకు సంక్షేమ పథకాలు నేరుగా అందేందుకు భారత ప్రభుత్వం ఆధార్ కార్డులను జారీ చేసింది. కాగా, వీటి జారీలో అక్రమాలు వెలుగు చూస్తు్న్నాయి. మామూళ్లకు ఆశపడి అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. రూ.30 వేలు ఇస్తే అనర్హులకు కూడా ఆధార్ కార్డు ఇప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నక్కలగుట్టకు చెందిన లలితా బొంస్లే సంతానానికి ముస్లింల పేరిట ఆధార్ కార్డులు వచ్చాయి. ఫిరోజ్, జియో అనే ఇద్దరు వ్యక్తులు వారి నుంచి డబ్బులు తీసుకుని ఆధార్ కార్డులు ఇప్పించారని బొంస్లే కుటుంబం తెలిపింది. తమను హైదరాబాద్‌కు తీసుకెళ్లి నకిలీ ఆధార్ కార్డు‌లను తయారు చేసి అందజేసి ఇచ్చారని ఆమె చెప్పారు. ఈ కార్డులు నకిలీ అని తేలడంతో ప్రభుత్వ పథకాలకు వర్తించవని తేలాయి. దీంతో తమకు సరైన ఆధార్ కార్డులను ఇప్పించాలని తహశీల్దార్‌కు బొంస్లే కుటుంబీకులు వినతి చేశారు.

Advertisement

Next Story

Most Viewed