- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ డాక్స్‌లో సమస్య.. ఇలా సాల్వ్ చేయండి
దిశ, ఫీచర్స్ : గూగుల్ డాక్స్ యాప్‌లో టెక్స్ట్ ఫార్మాటింగ్ సమస్యలు తలెత్తుతున్నాయని ట్విట్టర్, రెడిట్ ప్లాట్‌ఫామ్స్‌లో యూజర్లు కంప్లయింట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. టెక్ట్స్ ఎడిట్ చేయలేకపోతున్నామని కొందరు చెబుతుండగా.. టెక్ట్స్ రాస్తున్న క్రమంలో అకస్మాత్తుగా మిస్ కావడం లేదా ఓవర్ ల్యాప్ అవడం చోటుచేసుకుంటోందని మరికొందరు వెల్లడిస్తున్నారు. ఈ సమస్య కొంతమంది గూగుల్ స్లైడ్ వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం. ఇది క్రోమ్‌బుక్స్, విండోస్‌తో సహా వివిధ సిస్టమ్స్‌లోని వినియోగదారులకు జరుగుతుండగా.. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు. కాని దీనికో తాత్కాలిక పరిష్కారం ఉంది. అదెంటో తెలుసుకుందాం.
ప్రముఖ టెక్ వెబ్‌సైట్ ఆండ్రాయిడ్ పోలీస్ నివేదిక ప్రకారం.. గూగుల్ క్రోమ్‌లో యాడ్ బ్లాకర్ ఎనేబుల్ చేసిన వినియోగదారులకు ఈ సమస్య వస్తుంది. కాబట్టి గూగుల్ డాక్స్ లేదా స్లైడ్ వినియోగదారులు యాడ్ బ్లాకర్‌ను నిలిపివేయడమే ప్రస్తుతమున్న ఏకైక పరిష్కారమని సూచించింది. గూగుల్ ఇంకా ఈ సమస్యను పరిష్కలేకపోవడంతో ప్రస్తుతం ఇదే బెస్ట్ ఆప్షన్ అని ఆండ్రాయిస్ పోలీస్ అభిప్రాయపడింది. క్రోమ్‌లోని ప్రొఫైల్ ఐకాన్ పక్కన ఉన్న ఎక్స్‌టెన్షన్ ట్యాబ్‌ను క్లిక్ చేయడం ద్వారా యాడ్ బ్లాకర్‌ను ఇన్‌స్టాల్ చేశారో లేదో తనిఖీ చేయవచ్చు. ఇక్కడ మీరు ఉపయోగిస్తున్న ఎక్స్‌టెన్షన్ జాబితాను చూస్తారు. వాటిని నిలిపివేయడానికి త్రీ డాట్ మెనూ ఉపయోగించాలి. ఒకవేళ అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే, గూగుల్ దీన్ని సవరించే వరకు వెయిట్ చేయాల్సిందే.