- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా తప్పుడు సమాచారం లైక్ చేస్తే…
దిశ, వెబ్‌డెస్క్: కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని లైక్ చేశారా? షేర్ చేశారా? కామెంట్ చేశారా? అయితే దాని గురించి నోటిఫికేషన్‌ను ఫేస్‌బుక్ ఇవ్వనుంది. వినియోగదారుడు కరోనా సమాచారానికి సంబంధించిన పోస్టును లైక్, షేర్, కామెంట్ చేసిన తర్వాత ఆ పోస్ట్ తప్పుడు సమాచారం అని తేలితే… మీరు లైక్ చేసిన పోస్టు తప్పుడు సమాచారం అంటూ పేస్‌బుక్ నోటిఫికేషన్ పంపించనుంది. రానున్న వారం రోజుల్లో ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
అంతేకాకుండా, ఆ పోస్టులో ఏం తప్పు ఉందో, దానికి సరైన సమాచారం ఏంటో దానికి సంబంధించిన లింకులను కూడా ఫేస్‌బుక్ పంపించనుంది. గెట్ ద ఫ్యాక్ట్స్ పేరుతో ఒక ఫీచర్ సిద్ధం చేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వెరిఫై చేయనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ఇందుకోసం పార్టనర్ సంస్థలతో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ గురించి సోషల్ మీడియా, ఇంటర్నెట్లలో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం కారణంగా అందరూ భయాందోళనలకు గురై మానసికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దిగ్గజ సాంకేతిక సంస్థలన్నీ దీన్ని కట్టడి చేసే ప్రయత్నంలో తమ వంతు కృషి చేస్తున్నాయి.
Tags – corona, covid, lockdown, false news, facebook, get the facts, new feature