- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫేస్‌బుక్ లైట్’ డిలీట్ అయ్యిందా?
దిశ, వెబ్‌డెస్క్ : స్మార్ట్‌ఫోన్‌లో వాడే చాలా యాప్స్‌కు లైట్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. తక్కువ స్టోరేజ్, పూర్ నెట్ కనెక్షన్ ఉన్నయూజర్లను దృష్టిలో పెట్టుకుని ఆయా యాప్ నిర్వాహకులు లైట్ వెర్షన్‌ను అతి తక్కువ స్టోరేజ్‌తో తీసుకొస్తారు. ఫేస్‌బుక్‌కు కూడా ఫేస్‌బుక్ లైట్ వెర్షన్ యాప్ అందుబాటులో ఉంది. అయితే, ఆ యాప్ ఇకపై యాప్ స్టోర్‌లో కనిపించదు.
బ్రెజిలియన్ మీడియా ఔట్‌లెట్ మ్యాక్ మ్యాగజైన్ రిపోర్టు ప్రకారం.. యాప్ స్టోర్ నుంచి ఫేస్‌బుక్ తమ లైట్ వెర్షన్‌ను డిలీట్ చేసినట్లు పేర్కొంది. లైట్ యాప్‌లో హై రిజల్యూషన్ ఫొటోస్ కనిపించవు. హెవీ వీడియోస్ కూడా ప్లే కావు. ఓల్డర్ వెర్షన్ ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల యూజర్ల కోసం డెవలపర్లు ఈ లైట్ యాప్‌ను డిజైన్ చేశారు. 2జీ నెట్‌వర్క్ ఉన్న ఏరియాల్లోనూ ఇది పనిచేయగలదు. దీని డౌన్‌లోడ్‌కు కూడా కేవలం 12ఎంబీ ఉంటే సరిపోతుంది. అయితే, లైట్ వాడే వారి సంఖ్య తగ్గిపోవడం.. ప్రస్తుతం వాడుతున్న ఫోన్లలో అధిక స్పేస్ ఉండటంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం యాప్ స్టోర్ నుంచి దీన్ని తొలగించారు. కాగా, ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పటికీ ఈ యాప్‌ను వాడుకునే అవకాశం ఉంది.
ఫేస్‌బుక్ 2015లో ఈ లైట్ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు ఇంట్రడ్యూస్ చేయగా, 2018లో ఐఓఎస్ యూజర్లకు ఇది అందుబాటులో వచ్చింది. మొదటగా టర్కీలో ఈ యాప్‌ను విడుదల చేయగా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్త వినియోగదారులకు లైట్ యాప్ రిలీజ్ అయ్యింది. మెయిన్ ఫేస్‌బుక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 244 ఎంబీ అవసరం అవుతుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా లైట్ యాప్ టాటా చెప్పొచ్చు.