ఫేస్‌బుక్ పారదర్శక వేదిక

by Shamantha N |
ఫేస్‌బుక్ పారదర్శక వేదిక
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ పట్ల ఫేస్‌బుక్ ఉదారంగా వ్యవహరిస్తున్నదన్నవాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం సృష్టించిన దుమారం నేపథ్యంలో ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ స్పందించారు. ఇండియాలో తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పారదర్శక వైఖరినే అవలంభిస్తోందని స్పష్టం చేశారు. ఎవరైన తమ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛను ఫేస్‌బుక్ కల్పించిందని వివరించారు.

తాము పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నామన్న ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. విద్వేషం, మతోన్మాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ సామాజిక వేదికలో పోస్టయ్యే కంటెంట్‌తో ఒకే విధంగా వ్యవహరిస్తామని, ఇండియాలో తమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న కొందరు ప్రముఖుల పోస్టులను ఇప్పటికే తొలగించామని, మరికొన్ని కూడా తొలగిస్తామని మోహన్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed