- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వల్లే విపరీత సంఘటనలు’
దిశ, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వల్లే తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, విపరీత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని కల్వకుర్తి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అర్జున్ రెడ్డి ఆరోపించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితున్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఆయనను భద్రతా సిబ్బంది అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ యువతను మద్యానికి, గంజాయి, డ్రగ్స్ కు బానిస చేయడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ తన తీరు మార్చుకోని యువతకు చదువుకునేలా ప్రోత్సహించడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉన్నత వర్గానికి చెందిన వారికి ఒక న్యాయం, నిమ్న వర్గాలకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితున్ని తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.