పొట్ట సమస్యా?… ఇలా చేయండి

by sudharani |
పొట్ట సమస్యా?… ఇలా చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత జనాభాలో ఎక్కువమంది బాధపడే సమస్య పొట్ట. ఊబకాయం ఎక్కువగా పెడగడం మూలంగా మనిషి ప్రతి పనినీ వాయిదా వేసుకుంటూ వెళ్లడం కామన్. చేసే పనిలో వెంటనే అలసిపోవడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటోంది. ఈ పొట్ట సమస్య ప్రతీ ఇంట్లో.. ఒకరికి ఖచ్చితంగా ఉంటోంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలో, పొట్ట లోపల పేరుకుపోయిన కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలియక అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంత వాకింగ్ చేసినా, ఎన్ని వర్కౌట్లు చేసిన పొట్టతగ్గకుండా ఉండటంతో కొందరు మానసికంగా తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఈ పొట్ట కారణంగా డ్రెస్సులు కూడా ఇరుకైపోయి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ పొట్టను భరించలేక బాధతో ఫంక్షన్లకు వెళ్లడం, స్నేహితుల వద్ద పరువు పోతుందని అనేక పనులు వాయిదా వేసుకునే పరిస్థితులు అనేకం ఉంటాయి.

చాలా మందిలో ఈ పొట్ట సమస్య అధికమవుతున్నా కొద్ది తెల్ల రక్తకణాలు అతిగా స్పందించి మెదడులోని రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అంతేగాకుండా ఆలోచనా శక్తి మందగిస్తోంది. చురుకుదనం తగ్గడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుందని శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. రాత్రివేళ కాస్త తక్కువగా తినడంతో పాటు త్వరగా తినాలని, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి మంచింది. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటే అధిక బరువు సమస్య దరిచేరదు. శరీరానికి కాస్త శ్రమ ఇవ్వడంతో కేలరీలకు కేలరీలు కరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచనలు చేస్తున్నారు.

అయితే ఈ పొట్ట తగ్గాలంటే రోజూ ఎక్సర్‌సైజులు చేయడంతో పాటు డైట్ మెయింటైన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా ఆహారాన్ని అతిగా తీసుకోకుండా తక్కువ మోతాదులో తీసుకోవాలని అంటున్నారు. అంతేగాకుండా పౌష్టికాహారం కలిగిన పండ్లు, ఉలవలు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పును రోజూ మనం తినే ఆహారంలో వాడాలని అంటున్నారు. ఇవి రోజూ తింటూ ఉంటే… పొట్ట ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందని చెబుతున్నారు. దీనికి తోడు బయట తినే చిరుతిళ్లు బంద్ చేయాలని, ఇంట్లో భోజనం చేసిన వెంటనే బయట చిరుతిళ్లు తినడం చాలా ప్రమాదకరం అని వెల్లడించారు. అంతేగాకుండా మంచినీళ్లు అధికంగా తాగాలని, తినడానికి అరగంట ముందు నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. దాని ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుందని, ఉదయం తినే అల్పాహారం మన ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ కాస్త అధికంగా తింటే అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story