- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగాల్ దీదీ దే.. తమిళనాట స్టాలిన్ హవా..!
న్యూఢిల్లీ : దేశంలో మినీ ఎన్నికల సంగ్రామంగా సాగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు గురువారం వెలువడ్డాయి. బెంగాల్ ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా సంస్థలు వీటిని విడుదల చేశాయి. కొవిడ్ కాలంలో జరిగిన ఈ ఎన్నికలలో దేశం దృష్టిని ఆకర్షించిన పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికలకు ముందు పలు సంస్థలు చెప్పిన సర్వేల ఫలితాలే పునరావృతమయ్యాయి. నూవ్వా-నేనా..? అన్న రీతిలో సాగిన బెంగాల్ పోరులో మమతా బెనర్జీనే మరోసారి అధికారం దక్కించుకోబోతుందని మెజారిటీ సంస్థలు అంచనా వేయగా.. పలు సర్వేలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి.
తమిళనాడులో రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి బంపర్ మెజారిటీతో పీఠమెక్కనున్నది. అసోం మీద ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు షాకిస్తూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంపగుత్తగా బీజేపీకే అధికారం కట్టబెట్టాయి. ఇక కేరళలో సాంప్రదాయానికి విరుద్దంగా వరుసగా రెండోసారి వామపక్ష ప్రభుత్వమే కొలువుదీరనుంది. ఆశ్చర్యకరంగా పుదుచ్చేరిలో ఎన్డీయే అధికారం చేజిక్కించుకోనుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు కుండబద్దలు కొట్టడం గమనార్హం.