రేపే చిన్నమ్మ విడుదల

by Shamantha N |
రేపే చిన్నమ్మ విడుదల
X

బెంగళూరు: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ జైలు జీవితం బుధవారంతో ముగియనున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నాలుగేండ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నెల 27తో ఆమె శిక్షాకాలం పూర్తికానున్నది. కొవిడ్-19 సోకడంతో హాస్పిటల్‌లో చేరిన ఆమె మరికొంతకాలం బెంగళూరులో ఉండనున్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలైన శశికళ బుధవారం జైలు నుంచి విడుదలవుతారని, ఇందుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీలు హాస్పి‌టల్‌లో పూర్తి చేస్తామని జైలు అధికారులు తెలిపారు. ఈ నెల 20న శశికళ‌కు కరోనా వైరస్ సోకింది.

మొదట బౌరింగ్ హాస్పిటల్‌‌కు తరలించిన అధికారులు అనంతరం విక్టోరియా హాస్పిటల్‌లోని కొవిడ్-19 వార్డు సెంటర్‌కు మార్చారు. ఆమెను హాస్పిటల్‌ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. వైద్యులను సంప్రదించిన తర్వాత హాస్పిటల్‌ నుంచి శశికళ డిశ్చార్జ్ విషయమై నిర్ణయం తీసుకుంటామని అమ్మ ముక్కల్ మునేత్ర ఖజగం అధినేత, ఆమె మేనల్లుడు దినకరన్ తెలిపారు. రూ.66కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళ, ఆమె వదిన జే ఇళవరసి, దివంగత సీఎం జయలలిత దత్తపుత్రుడు వీఎన్ సుధాకరన్‌కు 2017, ఫిబ్రవరిలో కోర్టు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

Next Story

Most Viewed