రేగోడ్‌లో గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్టు

by Shyam |

దిశ, మెదక్: అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని ఎక్సైజ్‌, జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం రేగోడ్ మండలం సింధోల్ గ్రామానికి చెందిన నాగేందర్ తన ఇంటిలో గంజాయి నిల్వ చేసినట్టు విశ్వసనీయ సమాచారం అందింది. తనిఖీ చేయగా రూ. 60 వేల విలువ చేసే 10 కిలోలకు పైగా ఎండు గంజాయిని గుర్తించారు. నాగేందర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

Tags: Medak,Excise,Taskforce,Possession marijuana

Advertisement

Next Story