- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నల్లబెల్లం పట్టివేత.. ఆటోలు సీజ్
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ ఎక్సైజ్ అధికారులు అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నారు. నాటుసారా, కల్లు, నల్ల బెల్లం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ సీఐ కే బాలకృష్ణ వివరాల ప్రకారం కోయిల్ కొండ మండలం పారుపల్లి గ్రామంలో మల్కాపూర్ కు చెందిన రాములు ఆటోలో తరలిస్తున్న 330 కేజీల నల్లబెల్లం, ఐదు కేజీల పట్టిక, మూడు లీటర్ల నాటుసారా పట్టుకుని కేసు నమోదు చేశారు. బండమీదిపల్లి సమీపంలో ఆటోలో తరలిస్తున్న 30 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని ఆటో సీజ్ చేశారు. కల్లు తరలిస్తున్న కె .నారాయణ (వీరన్న పేట) ప్రకాష్ (తాటికొండ)లపై కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ పరిధిలోని కోయిల్ కొండ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 80 కేజీల బెల్లంతోపాటు రెండు కేజీల నవసాగరం లభించింది. ఆటోను సీజ్ చేసి కె. నాగేందర్ (రేగడిగడ్డ తండాకు చెందిన వ్యక్తి )ను అరెస్టు చేశారు. దేవరకద్రలో మండల కేంద్రంలో చంద్రన్న తన ఇంట్లో అక్రమంగా సారా అమ్ముతున్నాడన్న సమాచారంతో తనిఖీ చేయగా ఐదు లీటర్ల సారా లభ్యమైంది. అతన్ని అరెస్ట్ చేశారు. వీరందరని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు ఎక్సైజ్ సీఐ కె.బాలకృష్ణ తెలిపారు.
Tags: Mahabubnagar,Excise,Check