టాలీవుడ్ డ్రగ్స్ కేసు: కోర్టులో ఎక్సైజ్ శాఖ ఛార్జిషీట్

by Shyam |   ( Updated:2021-09-20 06:16:42.0  )
tollywood drugs case
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ వ్యవహారంలో కెల్విన్ వాంగ్మూలంగానీ, ఆయన వెల్లడించిన విషయాలుగానీ నమ్మశక్యంగా లేవని, ఆయన మాటల ఆధారంగా సెలెబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నట్లు స్పష్టతకు రాలేమని ఎక్సైజ్ శాఖ పేర్కొన్నది. కెల్విన్ మాటలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, ఆయన చెప్పినట్లుగా సెలెబ్రిటీల దగ్గర బలమైన ఆధారాలు దొరకలేదని రంగారెడ్డి జిల్లా కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో స్పష్టం చేసింది. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ మాటలు నమ్మశక్యంగా లేవని, ఆయన పేర్కొన్నవారిని సిట్ విచారించిందని, సోదాలు చేసిందని, కానీ ఎలాంటి మాదకద్రవ్యాలు దొరకలేదని పేర్కొన్నది.

విద్యార్థులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, హోటళ్ళకు అమ్మినట్లు కెల్విన్ చెప్పాడని, కానీ బలమైన ఆధారాలు దర్యాప్తులో ఎక్కడా లభించలేదని పేర్కొన్నది. సినీ దర్శకుడు పూరి, నటుడు తరుణ్ స్వచ్ఛందంగా శాంపిళ్ళు ఇచ్చారని, ఫోరెన్సిక్ పరిశోధనలో డ్రగ్స్ వాడినట్లు ఆనవాళ్ళు లేవనే రిపోర్టు వచ్చిందని పేర్కొన్నది. సెలెబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం సరిపోదని, ఆయన మాటలు దర్యాప్తును తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed