కరెంట్ కట్.. మాజీ సర్పంచ్ బూతుపురాణం

by Sridhar Babu |
కరెంట్ కట్.. మాజీ సర్పంచ్ బూతుపురాణం
X

దిశ, పెద్దపల్లి: కరెంట్ కనెక్షన్ కట్ చేయడంతో రెచ్చిపోయాడు మాజీ సర్పంచ్. పెద్దపల్లి మండలం అందుగులపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ విద్యుత్ సంస్థలకు 34 వేల రూపాయల బాకీ ఉన్నారు. దీంతో విద్యుత్ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. బిల్లు కట్టమని లైన్ మెన్ మాజీ సర్పంచ్‌కు ఫోన్ చేస్తే బూతు పురాణం వల్లించారు. నా ఇంటికి కరెంటు ఎలా కట్ చేస్తావ్ అంటూ ఫోన్‌లో బెదిరించాడు. ఎవరేం చేస్తారో నేను చూస్తా, నీవు ఊర్లోకి వస్తే జనాలచే కట్టేసి కొడుతా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ అవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed