బోధన కంటైన్‌మెంట్ జోన్లలో కలెక్టర్ పర్యటన

by vinod kumar |
బోధన కంటైన్‌మెంట్ జోన్లలో కలెక్టర్ పర్యటన
X

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి సూచించారు. గురువారం బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని కంటైన్‌మెంట్ క్లస్టర్లు అనిష్‌నగర్, షక్కర్‌నగర్, రాకాసి‌పేట ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరో 14 రోజులపాటు కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తే తప్పనిసరిగా పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. ఇందుకు అందరూ సహకరిస్తే రెడ్ జోన్‌లో ఉన్న జిల్లా కాస్త ఆరెంజ్ జోన్‌‌లోకి మారే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి రానున్న 14 రోజుల్లో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వచ్చినా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపీరామ్, ఏసీపీ జైపాల్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విద్య తదితరులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown, every one should follow rules, collecter narayana reddy

Advertisement

Next Story

Most Viewed