ఐఏఎస్ అధికారికి రూ.10 వేల జరిమానా

by Shyam |   ( Updated:2020-02-18 08:58:53.0  )
ఐఏఎస్ అధికారికి రూ.10 వేల జరిమానా
X

అనుమతి లేకుండా ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారంటూ సెంట్రల్ జోన్ కమిషనర్ ప్రావీణ్యకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు మంగళవారం రూ.10 వేలు జరిమానా విధించారు. ముఖ్యమంత్రి బర్త్ డే సందర్భంగా ‘మొక్కలు నాటాలి’ అంటూ గోల్కొండ ప్రాంతంలో జీహెచ్ఎంసీ జోన్ అధికారులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో వాటిపై ఈవీడీఎం విభాగం జరిమానా విధించడంలో ఇప్పుడు బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ-చలానాను తొల‌గించిన ఈవీడీఎం విభాగం..

ఈ నెల 17న న‌గ‌రంలో నిర్వ‌హించిన హ‌రిత‌హారం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గోల్కొండ కోట స‌మీపంలో ఏర్పాటుచేసిన బ్యాన‌ర్‌ను ఫ్లెక్సీగా భావించి జారీ చేసిన చలానాను తొలగించినట్టు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఓ ప్రకటనలో తెలిపారు. బ్యానర్ ఏర్పాటుపై ట్విట్ట‌ర్‌లో ఓ వ్య‌క్తి చేసిన ఫిర్యాదుపై ఈవీడీఎం విభాగం స్పందించి, వెంట‌నే పెనాల్టీ చెల్లించాల‌ని ఇ-ఛ‌లానా జారీచేసింది. అయితే సంబంధిత బ్యాన‌ర్ మెటీరియ‌ల్‌ను ప‌రిశీలించి, ఫ్యాబ్రిక్‌ క్లాత్ మెటీరియ‌ల్‌గా నిర్థార‌ణ చేసుకొని ఈ-చలానాను తొల‌గించిన‌ట్లు ఈవీడీఎం డైరెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed