- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ కేసీఆర్.. త్వరలో ఈటల పాదయాత్ర
దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నెమ్మదిగా తన స్వరం పెంచుతున్నారు. సుతి మెత్తని మాటలకు స్వస్తి చెప్పి ఘాటు విమర్శలు చేయడం ఆరంభించారు. బర్తరఫ్ తరువాత రెండుసార్లు హుజురాబాద్ కు వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో ఆయన మీడియా ముందు మాట్లాడలేదు. ఆచూతూచి ఆరోపణలు చేసిన ఈటల ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానం పెద్దలను కలసి వచ్చిన తరువాత దూకుడు పెంచారు. శామీర్ పేట్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కవితలను విమర్శించారు. అయితే రెండు రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల తన అస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. టార్గెట్ కేసీఆర్ అన్నట్టుగా తన మాటల తూటాలను పేల్చడం ఆరంభించారు. నియోజకవర్గంపై మిడతల దండులా దండయాత్ర చేయిస్తున్నారని, తల్లీబిడ్డలను వేరు చేస్తున్నట్టగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. జరగబోయేది కురక్షేత్ర యుద్దమేనని, ధర్మం వైపు ఉన్న పాండవులు గెల్చినట్టుగా హుజురాబాద్ ప్రజలు గెలుస్తారంటూ టీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. డబ్బులు పెట్టి ప్రజాప్రతినిధులను కొంటూ చెచాగాళ్లను ఉసిగొల్పుతున్నారని ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్‌ను ఏకీ పారేసేందుకు అన్నింటా సిద్దం అయిపోయినట్టుగా ఉన్నాయి ఈటల చేస్తున్న కామెంట్లు.
కేసీఆర్ టార్గెట్‌గా ఎటాక్ (Etela Rajender ready to do padayatra in Telangana targets KCR )
దాదాపు రెండు దశాబ్దాల అనుభందానికి దూరం కావడంతో మొదట్లో ఈటల మాట్లాడుతున్న తీరు చూసి డిఫెన్స్ లో పడ్డారనుకున్నారంతా. అసైన్డ్ భూముల వ్యవహారం తెరపైకి రావడంతో ఆయన వెనక్కి తగ్గారా? అన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారూ లేకపోలేదు. కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెదిలిన వారిలో ఒకరైన ఈటల ఆయన ఎత్తుగడలు, రాజకీయ వైరుధ్యం ఉన్న వారిని చరిత్రలో లేకుండా చేస్తున్న తీరును పరిశీలించినందున కొంత వెనకడుగు వేస్తున్నారని భావించినప్పటికీ, ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలు డైరక్ట్ అటాక్ గా మారిపోయాయి. టీఆర్ఎస్‌ను డిఫెన్స్ లో పడేసేలా తన వ్యూహాన్ని రచించుకున్నట్టుగా అర్థం అవుతోంది.
సెగ్మెంట్‌తోనే అటాచ్‌మెంట్
ఈటల రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలతోనే కలిసి ఉండేవిధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాతావరణం అనుకూలించే పరిస్థితులు ఉంటే పాదయాత్ర కూడా చేపట్టాలన్న యోచనలో ఈటల రాజేందర్ ఉన్నట్టుగా విశ్వనీయంగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల మీదుగా తన పాదయాత్ర చేపట్టి ప్రజల్లో ఉన్న బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేయనున్నారని సమాచారం.