తెలంగాణలో కుటుంబ పాలన వద్దు.. ప్రజలకు ఈటల పిలుపు

by Ramesh Goud |
తెలంగాణలో కుటుంబ పాలన వద్దు.. ప్రజలకు ఈటల పిలుపు
X

దిశ, స్టేషన్ ఘన్‎పూర్: త్యాగాల పునాదులపై నిర్మించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్ అహంకారానికి.. హుజురాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో శ్రీ బుగ్గులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలిచి దేవుళ్ళ మొక్కులు తీర్చుకునేందుకు చిల్పూర్ వచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ అహంకార కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఈటల పిలుపునిచ్చారు.

Advertisement

Next Story