- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Eatala Rajender :బిగ్ బ్రేకింగ్: పార్టీకి, పదవికి ఈటల రాజీనామా
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రాజేందర్..ఉరి శిక్ష పడే ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని.. కానీ, రాత్రికి రాత్రే ఎంక్వైరీ చేసి ఎలా మంత్రి పదవి నుంచి తీసేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కనీసం నేను ఒక మంత్రిని అని గుర్తించకుండా.. ఏ జరిగిందో తెలుసుకోకుండా.. అరగంటలోనే శాఖ నుంచి బర్త్‌రఫ్ చేయడం ఏంటని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. దీనికితోడు సీఎం కేసీఆర్ తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చి తనను ఒంటరి చేసే ప్రయత్నం చేశారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఎన్నిక అయినా పార్టీని గెలిపించుకున్నామని.. అటువంటి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పారు. అయినా నియోజకవర్గ ప్రజల ఈటల వెంటే ఉంటారని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్‌కు బంగారు పల్లెంలో పెట్టి ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి ఇచ్చామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. ఇంకా ఏమి ఇవ్వాలని తనను ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. ఎప్పుడూ కూడా పదవుల విషయంలో తాను అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకొచ్చారు. తనను ఎమ్మెల్యే పదవి నుంచి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. ఇంత జరిగాక పార్టీలో ఉండేదుకు తనకు కూడా ఇష్టం లేదని తెలిపారు. ఇంత ఇజ్జత్ తక్కువ బతుకు ఎందుకని నియోజకవర్గ ప్రజలు అంటున్నారన్నారు. అందుకే ఈ క్షణమే పార్టీ, పదవికి రాజీనామా చేస్తున్నానని ఈటల స్పష్టం చేశారు.
- Tags
- Eatala Rajender