- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధనవంతులు కావాలంటే అదొక్కటే మార్గం: ఈటల
దిశ, కరీంనగర్: ప్రభుత్వం చెప్పిన పంటలను సాగు చేస్తే ప్రతి ఒక్క రైతు దండిగా సంపాదించడం ఖాయమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇలా చేస్తేనే రానున్న కాలంలో రైతులు ధనవంతులు అవుతారని హితవు పలికారు. కరీంనగర్ కలెక్టరేట్లో పంటల సాగుపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జలాలు కరీంనగర్‌ను ముద్దాడడంతో రైతులు సంతోషంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ, ఎల్.ఎం.డి ద్వారా చెరువులు నింపేందుకు తూములు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే, మిడ్‌మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల దిగువ భాగంలో ఎక్కడెక్కడ కాలువ పూడికతీత పనులు ఆగిపోయాయో.. అవి కూడా పూర్తి చేసి రైతులకు నీళ్లందిస్తామని ఈటల భరోసా ఇచ్చారు. ఏ సమయంలో ఏ పంట వేయాలో సీఎం సమావేశం తర్వాత స్పష్టత ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మినిస్టర్ గంగుల కమలాకర్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.