- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల రాజేందర్ అసలు పేరు ఇదేనంటున్న బాల్క సుమన్
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్‌కు ఉపఎన్నిక అనివార్యమైన వేళ అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ప్రజాక్షేత్రంలోనూ, సోషల్ మీడియా వేదికగా విమర్శలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తల సోషల్ మీడియా సమావేశం స్థానిక బీఎస్సార్ గార్డెన్స్‌లో జరిగింది. దీనికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హాజరై మాట్లాడుతూ.. ఇటీవల బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌పై విరుచుక పడ్డారు. సీఎం కేసీఆర్‌కు ఈటల లెటర్ ప్యాడ్‌తో ఉన్న లెటర్ నిజమైనదే అని, దీనిని ఫేక్ లెటర్‌గా బీజేపీ కల్పిత ప్రచారం చేస్తుందన్నారు. ఆ లేఖ నిజం కాదని భాగ్యలక్ష్మి అమ్మవారి మీద బండి సంజయ్ ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి ఈటల వెన్నుపోటు పొడిచారని.. అందువల్లే ఆయన్ను ఇక మీదట ‘‘ఈటల రాజేందర్ బదులుగా వెన్నుపోటు రాజేందర్’’ అని పిలువాలన్నారు. ఈటల తన ఆత్మభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని.. ఢిల్లీ దొరల దగ్గర మొకరిల్లాడని విమర్శించారు. ఈటల ఇక నుండి బీజేపీ రాజేందర్ గానే మిగిలిపోతారన్నారు.
బీజేపీ వాళ్ళు డబ్బు సంచులతో వస్తారని జాగ్రత్తగా ఉండాలని గతంలోనే ఈటల రాజేందర్ చెప్పారని గుర్తుచేశారు. ఈటల ఒక సభలో 200 ఎకరాలు హైదరాబాద్‌లో ఉన్నాయని, ఒక్క ఎకరం అమ్మితే చాలు ఎన్నికల్లో ఖర్చు పెడుతా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు తాను ఓ బానిసను అని బాల్కసుమన్ వివరించారు. పూటకో పార్టీ మార్చే వాళ్ళు నీతులు చెప్పుతారా అంటూ బీజేపీ పై మండిపడ్డారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న చరిత్ర తనదన్నారు. అధికారం కోసం పార్టీలు మార్చే చరిత్ర బీజేపీ లీడర్లదని విమర్శించారు.