అందరికంటే ముందున్న ఈటల.. ప్రచార రథాలు సిద్ధం

by Sridhar Babu |   ( Updated:2021-06-28 04:08:57.0  )
etala-vehicles-ready 1
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హజురాబాద్ ఉప ఎన్నిక సమరానికి ఈటల రాజేందర్ తనదైన శైలిలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. మిగతా పార్టీలతో పోలిస్తే ఇప్పటికే కదన రంగంలోకి దిగిన ఈటల చాలా చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి తాను బీజేపీ పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నట్లు నియోజకవర్గ ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచార రథాలను కూడా సిద్దం చేయించారు. హైదరాబాద్‌లో రెడీ అయిన ఈ ప్రచార రథాలు మరి కొద్దిసేపట్లో హుజురాబాద్‌కు చేరుకోనున్నాయి. ఈ వాహనాలపై ప్రధాని మోడీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఫోటోలను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story