విశాలంగా రోడ్లు, ప‌రిశుభ్రంగా ఊళ్లు: ఎర్రబెల్లి

by Shyam |
విశాలంగా రోడ్లు, ప‌రిశుభ్రంగా ఊళ్లు: ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్‌: విశాలమైన రోడ్లు అలాగే ప‌రిశుభ్రంగా ఊళ్లు ఉండాలని.. అందుక‌నుగుణంగా అధికారులు ప‌ని చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు. రాయ‌ప‌ర్తి మండ‌లంలోని వివిధ అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన ఆయ‌న అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మీక్షించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంతో గ్రామాలను బాగుప‌ర్చుకునే అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. ప్ర‌ధానంగా రోడ్లు, డ్రైనేజీ స‌దుపాయాలు మెరుగుప‌డ్డాయ‌న్నారు. సీఎం ఇచ్చిన నిధుల‌తో అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు వేస్తున్నామ‌న్నారు. రాయ‌ప‌ర్తిలో అస‌లే లేని చోట్ల రోడ్లు వేయాల‌ని, ఉన్న చోట్ల డ‌బుల్ రోడ్లుగా అభివృద్ధి ప‌ర‌చాలన్నారు. అలాగే గ్రామాల్లో ప‌రిశుభ్రతను పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అధికారులకు సూచించారు.

tags: errabelli dayakar rao, review meeting, palle pragathi,

Advertisement

Next Story