ఎరోటికా, పోర్నోగ్రఫీ రెండూ ఒక్కటి కాదు.. శిల్పాశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

by Shamantha N |
Shilpa-shetty
X

ముంబై : నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో అరెస్టయిన తన భర్త రాజ్ కుంద్రా అమాయకుడని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలిపారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జుహూలోని వీరి నివాసంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే శిల్పాశెట్టిని పోలీసులు విచారించారు.

రాజ్ కుంద్రా పోర్న్ కంటెంట్‌‌ను ‘హాట్‌షాట్స్’ అనే యాప్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై స్పందిస్తూ, ఈ యాప్‌లో స్ట్రీమ్ అయ్యే కంటెంట్‌పై తనకు పూర్తి అవగాహన లేదని తెలిపారు. కానీ, ‘ఎరోటికా’, ‘పోర్నోగ్రఫీ’ రెండూ ఒక్కటి కాదని నొక్కిచెప్పారు. పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ చిత్రీకరణలో తన భర్త ప్రమేయం లేదని, ఆయన అమాయకుడని వెల్లడించారు. ఈ మేరకు తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి.

48 టీబీల అడల్ట్ కంటెంట్‌ సీజ్

పోలీసులు శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా నివాసంలో చేసిన తనీఖీల్లో రూ.7.5కోట్లతోపాటు ఫొటోలు, వీడియోలతో కూడిన 48 టీబీల అడల్ట్ కంటెంట్‌ను సీజ్ చేశారు.

Advertisement

Next Story