డ్రాగన్ కంట్రీలో మళ్లీ లాక్‌డౌన్

by vinod kumar |
డ్రాగన్ కంట్రీలో మళ్లీ లాక్‌డౌన్
X

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన వూహాన్ నగరంలో వైరస్‌ను పూర్తిగా నియంత్రించామని డ్రాగన్ కంట్రీ భావించింది.కానీ, విదేశీ ప్రయాణికుల రూపంలో మళ్లీ ఆ దేశంలో కేసులు పెరిగాయి. అయినా సరే సరైన భద్రతా చర్యలు పాటిస్తూ.. అందరినీ క్వారంటైన్‌కు తరలించి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. ఇన్ని చర్యలు చేపట్టినా చైనాలో కరోనా తాత్కాలికంగానే నియంత్రించబడింది. మొదట్లో చైనా తీసుకున్న కఠిన చర్యల వలన ఫలితాలు మెరుగ్గానే కనిపించాయి. కొన్ని రోజులు కేసులు సైలంట్ అయిపోయాయి. దీంతో అధికారులు లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేశారు.దీంతో జనాలు రోడ్ల మీదకు రావడం, పాఠశాలలు, ఫ్యాక్టరీలు ప్రారంభం కావడంతో డైలీ కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు.అదే సమయంలో కరోనా రివర్స్ గేర్ వేసింది. చాప కింద నీరులా కేసులు వెలుగులోకి రావటం మొదలైంది. ప్రస్తుతం మహమ్మారి ఒక నగరాన్నే కబలించేస్తోంది. జిలిన్ ప్రావిన్స్‌లో ఒకేసారి 34 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో.. అక్కడ మళ్లీ లాక్‌డౌన్ విధించారు. రవాణా, స్కూల్స్, ఇతర కార్యాలయాలను పూర్తిగా స్తంభింపజేశారు. రష్యా సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతం కావడంతోనే ఆ ప్రావిన్స్‌లో కరోనా తీవ్రంగా ప్రబలుతున్నట్టు చైనా వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ దేశం నుంచి జిలిన్ ప్రావిన్స్‌కు వచ్చిన వారి వల్లనే మళ్లీ కేసులు పెరుగుతున్నట్టు స్థానిక అధికారులు ధృవీకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed