గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల గ్యాంగ్ వార్..

by srinivas |
nalanda-college
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నలంద ఇంజినీరింగ్ కాలేజీ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు గ్రూపులకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

కార్లతో వెంబడించి మరీ సినీఫక్కీలో విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడికి సంబంధించిన పూర్తి ఇంకా తెలియాల్సి ఉన్నది.

Advertisement

Next Story