- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్మా థెరపీ ఫలితాన్నిస్తోంది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కరోనా రోగులకు చివరి ప్రయత్నంగా అందిస్తున్న ప్లాస్మా థెరపీ ఆశాజనకమైన ఫలితాలనిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆయన వైద్య నిపుణులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నలుగురు కరోనా రోగులకు ఢిల్లీ ప్రభుత్వం ప్లాస్మా థెరపీ చేయించగా, మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. వీరిలో ఇద్దరు పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్లాస్మా చికిత్సకు ముందు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండేదనీ, దీంతో వైద్యులు అతన్ని వెంటిలేటర్‌పై ఉంచారని గుర్తు చేశారు. కానీ, ప్లాస్మా థెరపీ అనంతరం అతని ఆరోగ్యం మెరుగుపడటంతో వెంటిలేటర్ తొలగించారని చెప్పారు. ఇలాగే, మరికొందరికి ట్రయల్స్ నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున ప్లాస్మా చికిత్స అందించేలా అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు. కావున కరోనా నుంచి కోలుకున్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, ప్లాస్మా చికిత్స అనేది కేవలం ఓ ఆశాకిరణం లాంటదేననీ, ఇంతమాత్రానా కరోనా నివారణకు మందు దొరికిందని భావించొద్దని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Tags: plasma therapy, coronavirus, arvind kejriwal, delhi cm, covid 19