‘సీరియల్ కిస్సర్’ ట్యాగ్‌తో ఫీలవుతున్న బాలీవుడ్ హీరో

by Jakkula Samataha |
‘సీరియల్ కిస్సర్’ ట్యాగ్‌తో ఫీలవుతున్న బాలీవుడ్ హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఉంటే.. ఆ సినిమా మొత్తం ముద్దులు, రొమాంటిక్ సీన్లతో నిండిపోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. దీంతో ఆటోమేటిక్‌గానే తనపై సీరియల్ కిస్సర్ ట్యాగ్ పడిపోయింది. అయితే ఈ ట్యాగ్ నుంచి బయటపడేందుకు డిఫరెంట్ ప్రాజెక్ట్‌లను ఎంచుకున్నట్లు తెలిపాడు ఇమ్రాన్. ప్రస్తుతం ‘ముంబై సాగా’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో.. ఆ తర్వాత ‘చెహ్రే, ఎజ్రా, టైగర్ 3’ సినిమాలు చేయబోతున్నట్లు వివరించాడు.

ఈ మూవీస్ రిలీజైతే ప్రేక్షకుల్లో ఇప్పటి వరకు తనపై ఉన్న ఒపీనియన్ మారిపోతుందని, ఇకపై అలా అడ్రస్ చేయబోరని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ట్యాగ్‌తో తను ఎప్పుడూ బాధపడలేదని, ‘ప్రజలు వారికి నచ్చిన విధంగా ఆలోచిస్తారు.. అలాంటి వారి దగ్గరకు వెళ్లి నేను అలా కాదు ఇలా అని వివరించలేను కదా’ అని చెప్పాడు ఇమ్రాన్ హష్మీ.

Advertisement

Next Story

Most Viewed