- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది నిముషాల్లో ‘కరోనా వైరస్’ పరీక్షలు
దిశ వెబ్ డెస్క్: చైనాలో పుట్టిన కరోనా వైరస్.. దేశదేశాలకు పాకి .. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా నుంచి వివిధ దేశాలకు ట్రావెల్ చేయడంతో .. ఈ వైరస్ మిగతా దేశాలకు విస్తరించి ఉంది. అందువల్లే విమానాలను పూర్తిగా రద్దు చేశారు. అయితే దుబాయ్ లో ప్రయాణాలు జరుగుతున్నాయి. అక్కడ విమానాలు ఎక్కే ప్రయాణికులకు కరోనా లేదని తేల్చేందుకు కేవలం 10 నిమిషాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.
కరోనా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందడానికి ప్రధానం కారణం విదేశీ ప్రయాణాలే. విమాన ప్రయాణాలు చేసే వారిలో వైరస్ ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా స్క్రీనింగ్ లో తెలియదు. దాంతో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టతరంగా మారింది. కరోనా వైరస్ ను అతి తక్కువ సమయంలోనే గుర్తించే విధానాన్ని దుబాయ్ అమలులోకి తెచ్చింది. ఇటీవల కొన్ని అంతర్జాతీయ విమానాలకు దుబాయ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా, వాటిని ఎక్కాలని భావించే విదేశీయులకు ఈ పరీక్షలు తప్పనిసరి చేసింది. ‘ఆన్ సైట్ రాపిడ్ కొవిడ్-19’ పేరిట పిలిచే ఈ టెస్ట్ లో ఫలితం 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ప్రముఖ విమానాయాన సంస్థ ఎమిరేట్స్ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. విమానయాన పరిశ్రమలోనే తొలిసారిగా ఎమిరేట్స్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. .
ప్రయాణాలు మొదలు కావడంతో:
విమానాశ్రయాల్లో కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేయడం ఇదే తొలిసారని ఎమిరేట్స్ వెల్లడించింది. దుబాయ్ లో విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశామని ప్రకంటించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న వివిధ దేశాల పౌరులు , వారి స్వదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసమే ఈ సర్వీసులను నడుపుతోంది. విమాన ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణీకుల రక్త నమూనాలు సేకరించి టెస్ట్ చేస్తారు. భారత ఎయిర్ పోర్టులు, ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా ఈ విధానాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఈ విధానంలో ఫలితాల కచ్ఛితత్వాన్ని పరిశీలించిన మీదట, ఇదే విధానాన్ని ఇండియాలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు వెల్లడించారు
tags :coronavirus, emirates, dubai, covid 19 test, rapid test