మంత్రి పర్యటనలో అధికారుల ఓవరాక్షన్.. ఎలక్ట్రానిక్ మీడియా బాయ్ కాట్

by Sridhar Babu |   ( Updated:2021-06-12 07:07:39.0  )
TRS Koppula Eashwar
X

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగుండం కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్‌లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ రేఖ చిత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి శ్రీ వేంకటేశ్వర స్వామి.. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకరిస్తామని మంత్రి అన్నారు.

అనంతరం రామగుండం మున్సిపల్ మీటింగ్ హాల్‌లో ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి, మున్సిపల్, ఇతర ఉన్నతాధికారులతో అభివృద్ధి సమావేశం ఏర్పాటు చేయగా మున్సిపల్ పీఆర్ఓ, మరో ఇద్దరు మున్సిపల్ అధికారులు.. మీడియాకు అనుమతి లేదని సీరియస్‌గా చెప్పారు. అధికారుల అనుమతి ఉంటేనే లోపలికి ప్రవేశించాలని తెలియజేయడంతో ఆ కార్యక్రమాన్ని రామగుండం ఎలక్ట్రానిక్ మీడియా బాయ్ కాట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed