- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోలేరు
దిశ, తెలంగాణ బ్యూరో: రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రత నియమాలను వాహనదారులు ఖచ్చితంగా పాటించే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ట్రాఫిక్ చలాన్లు జారీ చేసేందుకు ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ పేర్కొంది. ఈ సందర్భంగా తెలంగాణలోని 4 నగరాలైన హైదరాబాద్, నల్గొండ, పటాన్‌చెరు, సంగారెడ్డిలలో ఏర్పాటు చేయాలని మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో పైన తెలిపిన నగరాల్లో స్పీడ్ కెమెరా, సీసీ టీవీ కెమెరా, స్పీడ్‌గన్, బాడీ వేరబుల్ కెమెరా, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, వేయింగ్ మిషన్ లు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే వీటిని ఎక్కువ ప్రమాదాలు జరిగే, ఎక్కువ రద్దీగా ఉండే నేషనల్,స్టేట్ హైవేలు, కూడళ్లలో ఏర్పాటు చేయాలని తెలిపింది. దీంతో ఈ పరికరాలు ఏర్పాటు చేసిన చోట అతివేగంగా డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, నిషేధిత పార్కింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోతే ఈ కెమెరాల ద్వారా చలాన్లు జనరేట్ అవుతాయి.
దిశ.. దమ్మున్న వార్తలు..ఎప్పటికప్పుడు..1:30 PM EDITION
1. తాలిబన్లపై మొదలైన తిరుగుబాటు 2. తొలి మహిళా సీజేఐ ఆమేనా.. 3. ఇక చలాన్ల నుంచి తప్పించుకోలేరు
4. తెలంగాణలోని ఆ గ్రామంలో లాక్‌డౌన్