విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

by Shyam |
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
X

దిశ, మెదక్: లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు చేయుతగా సిద్దిపేట విద్యుత్ శాఖ తరుపున నిత్యావసరాలను పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ కరుణాకర్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటు, సామాజిక దూరం పాటిస్తూ మహమ్మరిని తరిమి కొట్టాలని ఎస్‌ఈ సూచించారు. ఉద్యోగులందరూ తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ‌లు శ్రీనివాసు, వెంకటరత్నం, ఏడీఈలు నాగార్జున రావు, పండరి, ఏఈలు వెంకటేశ్వర్ రావు, హుస్సేన్ పాల్గొన్నారు.

Tags: electric department, daily needs, distribution , medak

Advertisement

Next Story