5 రాష్ట్రాలకు ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు చేసిన సీఈసీ

by Shamantha N |   ( Updated:2021-02-26 07:31:42.0  )
5 రాష్ట్రాలకు ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు చేసిన సీఈసీ
X

దిశ,వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు అయింది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. బెంగాల్‌లో 294, అసోంలో 126, కేరళలో 140, తమిళనాడులో 234, పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను ఎన్నికలను నిర్వహించనున్నారు. కాగా మొత్తం 16 రాష్ట్రాల్లో 34 ఉపఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. కరోనా జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్దమవుతున్నామని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు.

కాగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలల్లో ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్6న మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29లల్లో ఎనిమిది విడతలుగా పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో మే2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాల వెల్లడిం ఉంటుందని సీఈసీ తెలిపారు. కరోనా జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్దమవుతున్నామని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed