బెంగాల్ డీజీపీ బదిలీ

by Shamantha N |
బెంగాల్ డీజీపీ బదిలీ
X

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణాన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వీరేంద్రను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వీరేంద్ర స్థానంలో 1987వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పి. నీరజ్ నయన్‌ను నియమించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయని ఈసీ తెలిపింది. అయితే బదిలీ చేసిన వీరేంద్రకు మాత్రం ఈసీ ఎలాంటి బాధ్యతలూ అప్పగించకపోవడం గమనార్హం. ఎన్నికల సన్నద్దతలో భాగంగా ఇటీవలే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజా నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed