- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కష్టకాలం.. డాన్ కూతురు దాతృత్వం
మెక్సికో సిటీ: అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలకు అక్రమంగా డ్రగ్స్ సరఫరా ఎక్కువగా మెక్సికో నుంచే జరుగుతుంది. ఆ దేశంలో అనేక మంది డ్రగ్స్ అక్రమంగా ఎగుమతి చేస్తుంటారు. అలాంటి సిండికేట్లను అన్నింటినీ శాసించే వ్యక్తి ఎల్ చాపో గుజ్‌మాన్. డ్రగ్స్ దందాలను తన కంటి చూపుతో శాసించే పెద్ద డాన్. మనం హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో చూసే డాన్లకు ఏ మాత్రం తగ్గని చరిష్మా ఇతని సొంతం. అచ్చం సినిమాల్లో చూపించినట్లే ఒకవైపు డ్రగ్స్ వ్యాపారాన్ని ఏలుతూనే.. మెక్సికో లోని పేదలకు అండగా ఉంటాడు. వారికి ప్రతీ విషయంలో ఆర్థికంగా సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘ఎల్ చాపో’ ఇప్పుడు జైల్లో ఉన్నా.. అక్కడి నుంచే తన సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. కానీ, ఇప్పుడు మెక్సికో కూడా కరోనా బారిన పడటంతో దేశం మొత్తం లాక్‌డౌన్ విధించారు. దీంతో పేదలు, రోజువారీ పనులు చేసుకునే వాళ్లు ఆకలితో పస్తులుంటున్నారు. దీంతో డాన్ ఎల్ చాపో కుమార్తె అలెజాండ్రినా గిసెల్లీ గుజ్ మాన్ రంగంలోనికి దిగింది. లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్నవారికి సాయం చేస్తోంది. తన తండ్రి ఫొటోతో బాక్సులు తయారు చేయించి వాటిలో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను ఒక ప్యాక్‌గా పేదలకు అందిస్తోంది. అంతేకాకుండా తన తండ్రి ముఖం చిత్రించిన మాస్కులను పంపిణీ చేస్తోంది. డాన్ కూతురుగా ఎంతో గుర్తింపు ఉన్న అలెజాండ్రీనా స్వతహాగా ఒక ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ నిర్వహిస్తోంది. ఎల్ చాపో 710 బ్రాండ్ పేరుతో అనేక రకాల వస్త్రాలు, ఇతర వస్తువులు అమ్ముతుంటుంది. ఇప్పుడు తన తండ్రి పేరుమీదే పేదలకు సాయం చేస్తోంది. మెక్సికన్ ప్రభుత్వం మాత్రం డాన్ బొమ్మలు వేసి సాయం చేయవద్దని.. ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని చెబుతోంది. అయినా డాన్ కూతురు, ఇతర గ్యాంగ్‌స్టర్లు ఎల్ చాపో బొమ్మతో పేదలకు సాయం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Tags : El chapom, Alejandrina, Mexico, Drug Dealer, Don’t, Coronavirus, Aid, Covid 19