10 స్కూళ్లకు విద్యాశాఖ నోటీసులు

by Shyam |   ( Updated:2020-03-16 07:11:35.0  )
10 స్కూళ్లకు విద్యాశాఖ నోటీసులు
X

కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈనెల 31వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. అయితే సోమవారం విద్యాశాఖకు చెందిన స్వ్కాడ్ బృందాలు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే కొన్నిస్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నడిపిస్తూ పట్టబడ్డారు. విద్యాశాఖ ప్రత్యేక చీఫ్ సెక్రెటరీ ఆదేశాల మేరకు ఆయా స్కూళ్లపై చర్యలకు ఆదేశించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. సుమారు 10పాఠశాలల యాజమాన్యాలు నోటిసులు అందుకున్న వాటిలో ఉన్నాయి. అవి :
1. వీఐపీ ఇంటర్నేషనల్ (సైదాబాద్, చార్మినార్, బహదూర్ పుర)
2.స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ (చార్మినార్)
3.షీరీన్ పబ్లిక్ స్కూల్ (సికింద్రాబాద్)
4.కుష్బు స్కూల్ (షేక్ పేట్)
5.జోషువా స్కూల్ (షేక్ పేట్)
6.సన్ రైజ్ స్కూల్ (షేక్ పేట్)
7.రోజరీ కాన్వెంట్ స్కూల్ (గన్ ఫౌండ్రీ)
8.ఆల్ సెయింట్స్ హైస్కూల్ (గన్ ఫౌండ్రీ)
9.లిటిల్ ఫ్లవర్ స్కూల్ (అబిడ్స్)
10.సెయింట్ మార్క్స్ బాయ్స్‌టౌన్ స్కూల్ (బహదూర్ పుర)

Tags: 10 schools running, breaking govt rules, educations cheif secretory gave orders to take serious action

Advertisement

Next Story

Most Viewed