- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు అలర్ట్.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
దిశ, ఫీచర్స్: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా లా కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న అభ్యర్థులకు తీపి కబురు అందించింది. సుప్రీంకోర్టులో లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ వెలువడింది. మొత్తం 90 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అర్హులైన అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక పోర్టల్ main.sci.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు దశల్లో పరీక్షను నిర్వహించనుండగా, ఎంపికైన వారికి రూ.80 వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపింది. జనవరి 24న ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 15న ముగియనుంది.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్తంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తుదారుడి వయసు 20 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్‌రోల్ చేసుకోవడం తప్పనిసరి. మనుపత్ర, NCC ఆన్‌లైన్, లెక్సిస్‌నెక్సిస్, వెస్ట్‌లా తదితర అంశాలపై అవగాహన ఉండాలి. అలాగే రీసెర్చ్ అండ్ అనలైటికల్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ తప్పనిసరి. ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో జాయిన్ అయి ఐదో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు, అలాగే మూడేళ్ల లా కోర్సులో చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు సైతం అప్లై చేసుకోవచ్చు.