- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NEET PG 2024 : ఆగస్టు 30న నీట్ పీజీ 2024 స్కోర్‌కార్డ్ విడుదల..
దిశ, వెబ్‌డెస్క్ : నీట్ పీజీ 2024 పరీక్ష స్కోర్‌కార్డ్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఆగస్టు 30న విడుదల చేస్తుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్‌కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లలో natboard.edu.in, nbe.edu.inలో విడుదల చేస్తారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ మొదలైన వాటి ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలరు. నీట్ పీజీ ఫలితాలు ఆగస్టు 23న వెలువడ్డాయి.
నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిప్టులో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో షిప్టులో పరీక్ష మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవ్వగా రాత్రి 7 గంటలకు ముగిసింది. పరీక్ష సీబీటీ విధానంలో జరిగింది. NBEMS జారీ చేసిన అధికారిక నోటీసు ప్రకారం అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్ ఆగస్టు 30న అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ చేయనున్నారు.
NEET PG 2024 స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా ?
NBEMS natboard.edu.in, nbe.edu.in అధికారిక వెబ్‌సైట్‌లకు లాగిన్ అవ్వండి.
హోమ్ పేజీలో ఇచ్చిన NEET PG 2024 స్కోర్‌కార్డ్ లింక్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు అభ్యర్థించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించండి.
స్కోర్‌కార్డ్ మీ స్క్రీన్ పై కనిపిస్తుంది.
ఇప్పుడు చెక్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
NEET PG 2024 : ఎంత మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు ?
మొదటి షిప్టు పరీక్షలో 1,14,276 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 1,07,959 మంది పరీక్షకు హాజరుకాగా, 6,317 మంది గైర్హాజరయ్యారు. రెండో షిప్టు పరీక్షకు 1,14,264 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 1,08,177 మంది పరీక్షకు హాజరుకాగా, 6,087 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. MD, MS, DNB సహా ఇతర మెడికల్ PG కోర్సులలో ప్రవేశానికి ప్రతి సంవత్సరం NEET PG పరీక్ష నిర్వహిస్తున్నారు.