- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీతో వన్ టూ వన్ 350! ....విపక్షం ఆశలు ఫలించేనా?
దేశంలోని మొత్తం 547 పార్లమెంట్ సీట్లలో బీజేపీ వర్సెస్ వన్ టూ వన్ గా 18 విపక్ష పార్టీలు ఐక్యతతో తల పడితే 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమనే అభిప్రాయానికి విపక్షాలు వచ్చాయి! ఈ విషయాన్ని సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి సీతారాం చెబుతున్నారు! పాట్నా సమావేశం అనంతరం విపక్షాలలో ఐక్యత రాగం బలపడుతున్నది! ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి కొన్ని ముఖ్యమైన అధికారాలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయలేదు కాబట్టి, విపక్షాలు తనకు సపోర్ట్ చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరుతున్నారు! పాట్నా సమావేశంలో దీని మీద మాట్లాడలేదని కేజ్రీవాల్ కాస్త అలిగి ఉన్నారు! అయితే ఈ విషయంలో ఆయనకు సపోర్ట్ ఇస్తాము, ఆయననే కాదు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ మాజీ సీఎం మాయవతిని కూడా పిలుస్తామని, బెంగళూరులో జులై 1౩,14న జరిగే విపక్షాల సమావేశంకు రావాలని కోరుతామని ఏచూరి అంటారు! దేశంలో పీఎం మోడీ హటావో! దేశ్ కి బచావో నినాదం విపక్షాలు ముందుకు వెళుతున్నాయి! బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే 2024 లో మళ్ళీ బీజేపీ గెలిస్తే ఈ తానాషాహీ పీఎం మోడీ ఇక దేశంలో ఎన్నికలే పెట్టరని, కాబట్టి అందరం ఐక్యతతో బీజేపీని ఓడించాలని అన్నారు!
అసాధారణ ఐక్యత సాధ్యపడితేనే...
చీటికీ మాటికీ ఈడీ, సీబీఐ రైడ్స్, కేసులతో విపక్షాలను వేధిస్తున్న విషయంలో విపక్షాల నేతలు అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. 2019 లో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఎక్కువ వచ్చినప్పటికి, ఓట్లు 37 శాతమే వచ్చాయి! 63 శాతం విపక్షాలకు ఓట్లు వచ్చాయి! ఈ కారణంగానే బీహార్ సీఎం నితీష్ కుమార్, సిపిఎం నేత ఏచూరీలు 350 సీట్లలో విపక్షాలు వన్ టూ వన్ గా బీజేపీతో తలపడే విధంగా ఒక ఫార్ములా తయారీలో ఉన్నామని అంటున్నారు. ఇందులో ఈ సంఖ్య 400కు కూడా పెరిగే అవకాశం ఉంది! యూపీ లాంటి రాష్ట్రంలో 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2019లో బీజేపీ 64 స్థానాల్లో విజయం సాధించింది! ఇక్కడ బీఎస్పీ,సమాజ్ వాది పార్టీతో పాటు జయంత్ చౌదరి కలిసి రావాలి! అప్పుడు ప్రయోజనం ఉంటుంది! ఆ దిశన కూడా విపక్షాల కూటమి యోచిస్తున్నది! సీపీఐ, సీపీఎం పాత్ర ఇప్పుడు కీలకం అయింది! ఓట్లు చీలవద్దు! ఓట్ల ట్రాన్స్ఫర్ కూడా జరగాలి! అప్పుడే ఉమ్మడి అభ్యర్థికి ప్రయోజనం జరుగుతుంది!
దేశంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల దేశంలో జరిగిన మార్పును, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం పైన కూడా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే చర్చించగా అందరూ వాస్తవమే అని పేర్కొన్నారు. దేశంలో పెరిగిన నిరుద్యోగం, అసమానతలు, అధిక ధరలు, దేశం మీద అప్పులు, విద్వేషాలు పెరిగే విధంగా బీజేపీ నేతల ఉపన్యాసాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను హరిస్తున్న తీరు మీద కూడా పాట్నా మీటింగ్‌లో సీరియస్‌గా చర్చించారు! మొత్తానికి జనతా పార్టీ ఏర్పాటు, విపక్షాల ఐక్యత లాంటి పరిణామాలను కూడా కొంత చర్చించుకున్న విపక్షాలు, జూలై 12న కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోని బెంగళూరులో సమావేశం కానున్నారు!
కలిసి పనిచేయడమే అసలు సమస్య
పాట్నాలో కనిపించని పార్టీల నేతలు, బెంగళూరులో కనిపిస్తారా? అలకతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వస్తారా? లేదా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందితే బెంగళూరుకు వెళతారా లేదా చూడాలి! మరోవైపు విపక్షాలు అధికారంలో ఉన్న తెలంగాణ, బెంగాల్, ఢిల్లీలలో పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి! తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంది! అటు బెంగాల్‌లో సీపీఎంతో అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మధ్యన ఉప్పు, నిప్పు లాంటి పరిస్థితి ఉంది. ఏపీలో సీఎం జగన్ రెడ్డి ఎటో తెలియదు. అయితే దేశం లో బీజేపీని ఓడించడం కోసం తృణముల్ కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి బెంగాల్‌లో సీపీఎం సిద్ధం అయిపోయింది అంటున్నారు ఏచూరి. తెలంగాణాలో ఈసారి అధికారంలోకి వస్తున్నామనే నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ ఇప్పటికప్పుడే బీఆర్ఎస్‌తో కలిసి పని చేసే పరిస్థితులు లేవు! ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ప్రస్తుతం లేవు!
చుక్కాని నడిపే సారధి ఎవరు?
మరో వైపు తెలంగాణలో మొదటి నుంచి బీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తున్న ఎంఐఎం ఈ సారి రాష్ట్రంలో బలం ఉన్న చోటల్లా పోటీ చేస్తామని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు! ఇప్పటికే దేశమంతా బీజేపీ బీ టీంగా ప్రచారంలో ఉన్న ఎంఐఎం వైఖరి చూస్తుంటే నెత్తి మీద మరిన్ని అపవాదులను మోసే పరిస్థితి ఉంది! దేశంలో విపక్షాల ఐక్యతకు ఇలా కొంత అక్కడక్కడ ఉన్న అడ్డంకులను ఎలా తొలగించుకుంటారో వేచి చూడాల్సిందే! విపక్షాల ఉమ్మడి ప్రధాని పదవికి అభ్యర్థి రాహుల్ గాంధీ ఉంటారా? కూటమి కమాండర్ ఎవరు? నితీష్ కుమార్ అవుతారా! ఈ విషయాలు జులై 1౩,14న బెంగళూరులో జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది! అయితే కామన్ మినిమం కార్యక్రమం, ఎజెండా కూడా నిర్ణయం ఇందులో జరిగే అవకాశం ఉంది!
ఎండి. మునీర్
సీనియర్ జర్నలిస్ట్
9951865223